Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాద్‌లో నడిరోడ్డుపై ఆర్టీసీ బస్సులో ప్రీ-వెడ్డింగ్ షూట్... ఇదిగో వీడియో

Pre Wedding Shoot in Hyderabad TSRTC bus
Advertisement
  • నెట్టింట వైరల్‌గా మారిన ప్రీ-వెడ్డింగ్ షూట్ వీడియో
  • ట్రాఫిక్‌లో ఆగి ఉన్న బస్సులో నుంచి దిగుతూ షూట్
  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
Advertisement
ఇప్పుడు పెళ్లంటే చాలు... ప్రీవెడ్డింగ్ షూట్ కోసం ఎగబడుతున్నారు. ఇలా ముహూర్తం పెట్టుకోవడమే ఆలస్యం... అలా ప్రీ-వెడ్డింగ్ షూట్ కోసం జంటలు రెడీ అవుతున్నాయి. తమకు నచ్చిన ప్రాంతాలకు వెళ్లి షూట్ చేయించుకొని... పెళ్లిలో ఈ ప్రీ-వెడ్డింగ్ షూట్ వీడియోను ప్రదర్శిస్తున్నారు. జంటలు తమ తమ అభిరుచులకు అనుగుణంగా ప్రాంతాలను ఎంచుకుంటే... ఫోటోగ్రాఫర్ తన క్రియేటివిటికి పదును పెట్టి వీడియోను సిద్ధం చేస్తున్నాడు. 

ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఓ జంట ఏకంగా ఆర్టీసీ బస్సులో ప్రీ-వెడ్డింగ్ షూట్ జరుపుకుంది. ట్రాఫిక్‌లో ఓ బస్సు ఆగి ఉన్న సమయంలో ఓ జంట ప్రీ-వెడ్డింగ్ షూట్ జరుపుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. యువతి బస్సులో నుంచి దిగుతున్నట్లుగా.. అబ్బాయి వెనుక నుంచి వస్తున్నట్లుగా వీడియో ఉంది. ఆ తర్వాత రోడ్లపై కూడా షూట్ చేశారు. ఈ వీడియోపై చాలామంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఎస్ఆర్టీసీని ట్యాగ్ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రాఫిక్‌లో నడిరోడ్డుపై నిలిచిన బస్సు వద్ద షూటింగ్ చేయడాన్ని చాలామంది తప్పుబడుతున్నారు.
Advertisement
Advertisement
Hyderabad
tsrtc
wedding

More Telugu News